
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అంగీకరించారని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు తెలిపారు. హుజురాబాద్ ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేయగా ఆయన అంగీకరించి మంజూరు చేశారని త్వరలో ఏర్పాటు కాబోతుందని చెప్పారు. ఈ ట్రామా సెంటర్ వల్ల రహదారి వెంబడి ప్రమాదాలు జరిగినప్పుడు త్వరితగతిన స్పందించి క్షతగాత్రులను తక్షణ చికిత్స అందించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. దీనివల్ల వరంగల్ కరీంనగర్ ఆసుపత్రులకు వెళ్ళనవసరం లేదని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు





