
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వేసవి కాలంలో విద్యార్థుల సర్వతో మృక అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న వేసవి ప్రత్యేక శిబిరాలను ఉపయోగించుకొని ప్రయోజనం పొందాలని హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని అన్నారు. సోమవారం విద్యావారోత్సవాల్లో భాగంగా.. హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఈ 15 రోజుల శిబిరం ద్వారా విద్యార్థిని విద్యార్థులు ప్రయోజనం పొందాలని అన్నారు. అనంతరం ఎంఈఓ విడపు శ్రీనివాస్ మాట్లాడుతూ….విద్యార్థులు నైతిక విలువలతో పాటు క్రీడా నైపుణ్యాలని కళల పట్ల అభిరుచిని పెంపొందించు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోయిల్ కార్ భారతి,అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్ పర్సన్ కొలిపాక సునీత, ఏఈ రమేష్, ప్రధానోపాధ్యాయులు డిఎం తిరుమల, బొరగాల తిరుమల, జానపాటి ప్రదీప్, ఖైరున్నీసా, రాధిక, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు వేల్పుల రత్నం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వేసవి శిక్షణ శిబిరం ప్రారంభిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని..

కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని
–చెల్పూరులో…..
హుజురాబాద్ మండలం చెల్పూర్ జెడ్ పిహెచ్ ఎస్ పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఈ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఎంఈఓ విడపు శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు అనురాధ ,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ రాజసులోచన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

చెల్పూర్ జెడ్ పిహెచ్ ఎస్ పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభిస్తున్న ఎంఈఓ విడపు శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు అనురాధ ,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ రాజసులోచన





