
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాల నివారణ కేంద్రం హుజురాబాద్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలు నివారణ చర్యలపై డెమో(మాక్ డ్రిల్) కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రవణ్ కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ ఉమాశ్రీ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణరెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో వెంకటరమణ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణ చర్యల గురించి అవగాహన కలిగి ఉండాలని, వాటినుండి పేషెంట్లకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలని చెప్పారు. ప్రతి ఆసుపత్రి అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు, సౌకర్యాలను కలిగి ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలను ఆర్పే యంత్రాల గురించి డెమో ఇచ్చారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ హెచ్పివి టీకా కేంద్రాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేశారు. 14 సంవత్సరాల నుండిన బాలికలకు క్యాన్సర్ రాకుండా హెచ్పీవీ టీకా ఇప్పించాలని దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.





