
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, జూన్ 10: హుజూరాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారిగా (ఆర్డీఓ) బాధ్యతలు స్వీకరించిన నాయక్ వాడి జల కుమారి బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జల కుమారి కలెక్టర్కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని పరిపాలనా అంశాలు, రెవెన్యూ శాఖ పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తదితర విషయాలపై చర్చించారు.
హుజూరాబాద్ డివిజన్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

కలెక్టర్కు పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలుపుతున్న హుజురాబాద్ ఆర్డిఓ





