
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తమ ఉద్యోగ నిర్వహణలో ప్రభుత్వం చే ఉత్తమ ఉద్యోగులుగా గుర్తించబడి అవార్డు పొందిన ముగ్గురిని వారి బాల్యమిత్రులు శనివారం ఘనంగా సన్మానించారు. హుజురాబాద్ కు చెందిన మేకల మహేందర్ రెడ్డి ఎస్సైగా రామగుండం కమిషనరేట్ లో పనిచేస్తూ ఉత్తమ పోలీసుగా అవార్డు పొందాడు. పెద్దపల్లి జిల్లాలో ఏఎస్సైగా పనిచేస్తున్న బండ రఘు ఉత్తమ పోలీసుగా అవార్డు పొందాడు. చొప్పదండి వైద్య ఆరోగ్యశాఖలో సూపర్వైజర్ గా పని చేస్తున్న గంగిశెట్టి శ్రీదేవి ప్రశంసా పత్రాన్ని పొందింది. బాల్యంలో తమతో చదువుకొని ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతూ అవార్డులు పొందుతున్న వారిని శనివారం హుజూరాబాద్ పట్టణంలోని ఆదర్శ విద్యాలయంలో వారి బాల్యమిత్రులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… తమ బాల్య స్నేహితులు మరిన్ని ఉన్నత పదవులు పొందాలని అవార్డులు పొంది ప్రజలచే ఉన్నతాధికారులతో ప్రశంసలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చింత శ్రీనివాస్, పరాంకుశం కిరణ్ కుమార్, మిడిదొడ్డి ప్రదీప్ కుమార్, దేవరకొండ సంతోష్, చింతల రమేష్, మంచికట్ల సమ్మయ్య, విజయేందర్ రెడ్డి, అవుదుర్తి శ్రీనివాస్, సాదుల విజయలత, వెంకటేశ్వర్లు, శర్మ శ్రీరామాంజనేయులు, నలుబాల వేణుగోపాల్, నల్ల సురేందర్, భూసారపు శంకర్, ప్రకాష్, బి.వెంకటేశ్వర్లు, సాజిద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ ఉద్యోగులను సన్మానిస్తున్న బాల్యమిత్రులు





