
—యువత చదువుపై ఏకగ్రత పెంచుకోవాలి
—హుజురాబాద్ ఏసిపి మాధవి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారని, వాటికి దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలని హుజురాబాద్ ఏసిపి మాధవి సుదించారు. కరీంనగర్ జిల్లా సిపి గౌస్ ఆలం ఆదేశాల మేరకు సోమవారం హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మత్తు పదార్థాల అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు.


ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకొని చదివిస్తారని వారి ఆశయాలకు అనుగుణంగా చదివి ప్రయోజకులు కావాలని కోరారు. మత్తు పదార్థాల వాడకం వల్ల సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి విద్యార్థి తమ జీవితంలో ఒక గొప్ప ఆశయాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా చదవాలన్నారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెంచుకోవాలని అన్నారు. విద్యార్థులు చదువుకునే విద్యాసంస్థల వద్ద పరిసర ప్రాంతాల్లో మత్తు పదార్థాలు వాడకం కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువుకు దగ్గరగా ఉంటే వృద్ధిలోకి వస్తారని అని అన్నారు.

అలాగే అతిథిగా విచ్చేసిన పట్టణ సీఐ కరుణాకర్ మాట్లాడుతూ యువత పెడదారిన పడితే వారు వారి కుటుంబ సభ్యులు, సమాజానికి హాని చేసినవారిగా మిగిలిపోతారని అలాంటి విచ్చలవిడితో కూడినటువంటి అలవాట్లను చేసుకోకూడదని సూచించారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ తులసి దాస్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదువుతున్న యువత చెడుకు త్వరగా ఆకర్షితులవుతారని అలా ఆకర్షితులు కాకుండా మీకు ఉజ్వల భవిష్యత్తు మంచిగా ఉండెలా జీవించాలని సూచించారు.

గత మున్సిపాలిటీ ఎన్నికల విధులలో పాల్గొన్న NSS వాలంటీర్లకు certificates అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విజయేందర్ రెడ్డి, మురళీమోహన్, వాసుదేవరావు, రాజేశం, రాజశేఖర్, మల్లారెడ్డి, ఇతర అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.





