
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అర్హులైన ప్రజలకు ఓటు హక్కు కల్పించడంలో బిఎల్ఓ లది కీలకo అని హుజురాబాద్ ఆర్డిఓ జల కుమారి అన్నారు. సోమవారం హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో హుజురాబాద్ నియోజకవర్గం ఎస్ ఐఆర్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 25 నుండి ఎస్ ఐఆర్ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఇందులో భాగంగా బిఎల్వోలు తమకు కేటాయించిన బూతులలో ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి మరణించిన వారి ఓట్లను తొలగించాలని అన్నారు. మ్యాపింగ్, నాన్ మ్యాపింగ్ అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలు సైతం బాధ్యతగా అర్హులైన వారి ఓట్లను ఉండే విధంగా మరణించిన వారి ఓట్లను తీసివేసే విధంగా సహకరించాలన్నారు. ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలని, ఎక్కువ ఓట్లు ఉన్న చోట నుండి తీసివేయించుకోవాలన్నారు. బిఎల్ వో లకు ఎలాంటి అనుమానాలు ఉన్న డిఎల్.ఎంటిల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ తహసిల్దార్ జక్కని నరేందర్, నాయబ్ తాసిల్దార్ దివ్య రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కిషన్, డిఎల్ ఎంటి తూముల మాధవరావు, వేణుగోపాల్, సత్యనారాయణ, గిరిదావర్లు శేఖర్, ప్రవీణ్ కుమార్, బాలకిషన్, రవి, జ్యోతి, పలువురు సూపర్వైజర్స్, బిఎల్వోలు, బిఎల్ఏ లు పాల్గొన్నారు.

కార్యక్రమానికి హాజరైన పలువురు సూపర్వైజర్స్, బిఎల్వోలు, బిఎల్ఏ లు





