Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం మొహర్రo పండుగ వేడుకలు ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పీరీలను పట్టుకొని డప్పు చప్పులతో వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కొంతమంది పీరీలకు ఎదురెళ్లి దర్టీలు కట్టుకునీ కొబ్బరికాయలు కొట్టారు. ఈ వేడుకల్లో ముస్లింలతో పాటు హిందువులు సైతం ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ పలువురు నినాదాలు చేశారు.





