Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ డివిజన్ పరిధిలోనీ ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంల పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ ప్రభుదాసు శనివారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో సైదాపూర్, శంకరపట్నం, చేల్ పూర్, ఇల్లందకుంట, వావిలాల, చల్లూరు, వీణవంకలలో దాదాపు 17742 మంది జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 180పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశామని, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు అందరూ జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకు పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. బస్టాండ్ కేంద్రాలలోనూ రైల్వే స్టేషన్లలోనూ పోలియో చుక్కల కేంద్రాల ఏర్పాటు చేశామని తెలిపారు. ఆదివారం నుండి మంగళవారం వరకు ఈ కార్యక్రమం ఉంటుందని. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకొని పిల్లలను ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. ఇటుక బట్టీల కార్మికులు, వలస కార్మికులు, రైస్ మిల్లులో పనిచేసే కార్మికుల పిల్లలకు అన్ని సమస్య ఆత్మక ప్రదేశాలలోనూ పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేయాటానికి మొబైల్ టీం లను ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ డిఎంహెచ్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య బోధకులు పంజాల ప్రతాప్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సదానందం తదితరులు పాల్గొన్నారు.





