
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవలే భూమి విక్రయం విషయంలో ఎమ్మార్వో ఆఫీస్ లో జరిగిన మహిళ ఆత్మహత్యాయత్నం కావాలని చేశారని భూ విక్రయ దారుడు అంబాజీ ఆరోపించారు. శనివారం హుజురాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మా అమ్మానాన్నల నుంచి వచ్చిన ఆస్తిని అప్పులు చెల్లించుకునేందుకు అమ్ముకుంటున్నానని అన్నారు. నా భూమిని కాజేసేందుకే రాజ్ కమల్ ఆయన తల్లి పద్మ ఎమ్మార్వో కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం డ్రామాలు ఆడారని అన్నారు. నా భూమిని అమ్ముకునేందుకు నాకు మాత్రమే హక్కు ఉంటుందని అన్నారు. నాకు తోడబుట్టిన వారు ఎవరూ లేరని, గతంలో రాజ్ కమల్ మూడు గుంటలు కొంటానని చెప్పి పాస్ పుస్తకం తీసుకువెళ్లి ఇవ్వడంలేదని ఆరోపించారు. ఇట్టి విషయమై ఇప్పటికే సిపి కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశామన్నారు. అనంతరం భూమి కొనుగోలు దారుడు నానాజీ మాట్లాడుతూ అంబాజీ వద్ద నుంచి ఎకరం కొనుగోలుకై ఇప్పటికే 50 లక్షలు చెల్లించి ఉన్నామని, తమకు రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా అంబాజిని కోరగా అంబాజీ అంగీకరించడంతో ఎమ్మార్వో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కోసం చలానా కట్టామని అన్నారు. ఇంతలో రాజ్ కమల్ ఆయన తల్లినీ వెంటబెట్టుకొని వచ్చి కావాలనే రాద్ధాంతం చేశారని అన్నారు. ఎమ్మార్వో, ఆర్డీవోలకు సంబంధం లేని విషయాన్ని డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు చేశారని అన్నారు. అసలు అధికారులకు లంచం ఇవ్వాల్సిన అవసరం మాకు ఏంటని ఆయన ప్రశ్నించారు. అధికారులను ఇబ్బంది పెట్టేందుకే కావాలని రాజ్ కమల్ ఇలా చేశారని పేర్కొన్నారు. అసలు భూమి కొనుగోలుకు రాజ్ కమల్ కు సంబంధమే లేదని అన్నారు. భూమి కొనుగోలు విషయంలో అధికారులు పూర్తి వివరాలు సేకరించి మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రాజ్ కమల్, నానాజీ..





