
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోనీ (కిందివాడ మూడు బజార్లు )దగ్గర ఆ వాడకు చెందిన చీకట్ల సమ్మయ్య- సునీత కుటుంబం వారి స్వగృహం వద్ద రేణుక ఎల్లమ్మ తల్లి ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమం రంగ రంగ వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన కళాకారులను తీసుకువచ్చి పలు రకాల వేషధారణలు వేయగా అవి ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రోంటాల సుహాసిని, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, గౌడ సంఘం నాయకులు, వాడ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కళాకారులతో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు.



అందంగా అలంకరించిన రథంపై రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహాలను పెట్టి ఊరేగించారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి మంగళహారతులు ఇచ్చి దర్శనం చేసుకున్నారు. ఎంతో చక్కగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఈ ఏడాది మూడవ సంవత్సరమని, గత మూడు ఏళ్లుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు చీకట్ల సమ్మయ్య తెలిపారు. రేణుక ఎల్లమ్మ తల్లి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో చీకట్ల కుటుంబ ఫ్యామిలీ, గౌడ సంఘం నాయకులు, వాడ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఫలహారం ఊరేగింపు బండి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..




కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని..





