
– పీవి సేవ సమితి, ఆలయన్స్ క్లబ్ అధ్యక్షులు తూము వెంకట్ రెడ్డి, బి.మనోజ్ ల ఆధ్వర్యంలో వేడుకలు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : మాజీ ప్రధాని, భారతరత్న పీవి నర్సింహారావు జీవితాన్ని మనందరం స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని పట్టణ ప్రముఖులు ప్రజలకు పిలుపు నిచ్చారు. పీవి సేవ సమితి, ఆలయన్స్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు పీవీ 105వ జయంతి వేడుకలను పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ పీవి మార్గ్ వద్ద ఘనంగా నిర్వహించి మిఠాయిలు పంచారు. ముఖ్య అతిథిగా హుజురాబాద్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని, సీఐ కరుణాకర్, సిటిజన్ ఫోరం అధ్యక్షులు సంధ్యల వెంకన్న తదితరులు పీవి విగ్రహానికి పూల మాల వేశారు.


పీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, బీసీ సంఘం నాయకులు, కాంగ్రెస్ నేతలు..
తదనంతరం వారు మాట్లాడుతూ దక్షిణ భారతదేశం నుండి తొలి తెలుగు ప్రధానిగా చరిత్రలో తన స్థానాన్ని, స్థాయిని స్థిరపరుచుకున్నారని తెలిపారు. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు వారు తీసుకున్న సహసోపెత నిర్ణయాలు అనేక ఆర్థిక సంస్కరణములు దేశం ప్రగతి పథం వైపు నడిచేలా దోహద పడ్డాయాని అన్నారు. నేటికీ ఆచరరించబడుతున్నాయని వారు అభిప్రాయ పడ్డారు. సంస్కరణల పితామహుడుగా, బహుభాష కోవిదుడుగా అపర చాణిక్యునిగా.. పీవి ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. వారి జీవితం మనకు ఆదర్శమని, వారు ఈ ప్రాంత వాసిగా తెలుగు వారందరికీ గర్వకారణం అని అన్నారు. పీవీ సేవ సమితి అధ్యక్షుడు తూము వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పీవీ దేశానికీ అందించిన విశిష్ట సేవలను గుర్తు చేశారు.


ఈ కార్యక్రమంలో పీవి సేవ సమితి, ఆలయన్స్ క్లబ్ అధ్యక్షులు తూము వెంకట్ రెడ్డి, బి.మనోజ్, డాక్టర్ తోగరు విద్యాసాగర్, బీసీ నాయకులు చందుపట్ల జనార్దన్, బీజేపీ సీనియర్ నాయకులు రావుల భాస్కర్ రెడ్డి, మంచికట్ల మురళి, పివి సాహిత్య పీఠం జిల్లా కార్యదర్శి విష్ణుదాస్ గోపాల్ రావు, ఉపాధ్యక్షులు వి రవీందర్రావు, ఇందుర్తి నరేష్, ఇందుర్తి రమేష్, కన్నన్ దూరై రాజు, పీళ్లి సమ్మయ్య, దాసారపు, కుమార్, ఇంద్రకరణ్, తులసి లక్ష్మణమూర్తి, మహాలక్ష్మి సీడ్స్ సంపత్ రావు, కాసార్ల శ్రీహరి, మురికి గౌరీశంకర్, ముక్కెర కన్నయ్య, కల్లెపు రాఘవ రావు, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






