
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం వల్ల వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు పిల్లలకు ఆయన పోలియో చుక్కలను వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తప్పనిసరిగా ప్రతి తల్లిదండ్రులు తమ ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలను విధిగా వేయించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ సైతం పిల్లలకు పోలియో చుక్కలను వెయ్యడానికి ఏర్పాటుచేసిన పోలియో కేంద్రాలలో మన పిల్లలను తీసుకొని వెళ్లి పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ప్రభుదాస్, ఏరియా ఆసుపత్రి ఇంచార్జ్ డాక్టర్ పి శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ జి శ్రవణ్, డాక్టర్ తులసీదాస్, డాక్టర్ జరీనా, కౌన్సిలర్లూ గందె శ్రీనివాస్, కే భారతి, బోరగాల మొగిలి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ ముత్యంరాజు, ఐసి టిసి కౌన్సిలర్ సుజాత, ఆశా కార్యకర్తలు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.


పోలియో చుక్కలు వేసి చిన్నారిని ఎత్తుకున్న ఎమ్మెల్యే
–పల్స్ పోలియోలో పాల్గొన్న చైర్ పర్సన్ సుహాసిని
హుజురాబాద్ పట్టణంలో ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఏరియా ఆసుపత్రి వద్ద, గాంధీనగర్ స్కూల్ వద్ద నిర్వహించిన కార్యక్రమాల్లో హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ రొoటాల సుహాసిని పిల్లలకు పోలియో చుక్కలు వేయడం ద్వారా పాల్గొన్నారు.

పోలియో చుక్కలు వేస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని..

గాంధీనగర్ స్కూలులో చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, పక్కన కౌన్సిలర్ మొగిలి..





