
—నిరుపేద లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది.
—సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన హుజురాబాద్ ఇంచార్జి ప్రణవ్ బాబు.
—సంక్షేమ పథకాల విషయంలో పారదర్శకత పాటిస్తున్నాం.ఎవరైనా డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటాం,అవసరమైతే సస్పెండ్ కి వెనకాడం..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలో నిరుపేదలైన లబ్ధిదారులకు సంక్షేమం అభివృద్ధి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. మంగళవారం నాడు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 82 మందికి 30 లక్షల విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు నేరుగా అందజేశారు. నిరుపేదలు పరిస్థితి బాగోలేక ఆసుపత్రులపాలైన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో అండగా ఉంటుందని, ఇప్పటివరకు హుజురాబాద్ లో సుమారు 10కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు.



ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పారదర్శకత పాటిస్తున్నాం, డబ్బులు అడిగితే సస్పెండ్ కి వెనకాడం..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో పారదర్శకతను పాటిస్తున్నామని, త్వరలో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వబోతున్నామని తెలిపారు. సంక్షేమ పథకాల విషయంలో ఏవరైనా డబ్బులు అడిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ పిలుపునిచ్చిన ఇలాంటి కార్యక్రమాల్లోనైనా చురుకుగా పాల్గొనాలి తప్ప నిర్లక్ష్యం వహిస్తే బాగుండదన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికే భవిష్యత్తులో పార్టీ అండగా ఉంటుందని, నిర్లక్ష్యం చేసే వారికి భవిష్యత్తులో ఎలాంటి గుర్తింపు ఉండదని పరోక్షంగా ఆయన హెచ్చరించారు.


ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రోంటాల సుహాసిని, పలువురు కౌన్సిలర్లు, జమ్మికుంట, కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, అన్ని మండలాల ప్రజా ప్రజాప్రతినిధులు, మండలాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






