
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : చేనేత సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అభివృద్ధి చేసేందుకు నా వంతుగా కృషి చేస్తానని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు తెలిపారు. సోమవారం హుజురాబాద్ మండలం రాంపూర్-రంగాపూర్ లో గల బాపూజీ చేనేత సహకార సంఘాన్ని ఆయన సందర్శించారు.


ఈ సందర్భంగా ఇటీవల నూతనంగా పాలకవర్గం ఏర్పాటుకాగా కొత్తగా ఎన్నికైన వారిని శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ముషం వెంకట నారాయణ, ఉపాధ్యక్షుడు జడల వెంకటేశ్వర్లు, కోశాధికారి ముషం రవి, సభ్యులుగా వెంకటేశ్వర్లు, ప్రభులింగం, సదానందం, శాంతయ్య, బండారి శోభా-సదానందం, పద్మ,లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సదానందం, జిల్లా అధికార ప్రతినిధి నేరేళ్ల మహేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబయ్య, యూత్ కాంగ్రెస్ నేత సజ్జు, గ్రామ శాఖల అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, రామచంద్రం, నరసింహరెడ్డి, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.





