
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం ప్రసూతి వార్డును సందర్శించి పలువురితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ దంపతులు తమ పుట్టిన పసిపాపను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి అందించి ఎత్తుకొమ్మన్నారు. వారు కోరడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పసిబాబును ఎత్తుకొని ముద్దు చేశాడు. మీ అంత గొప్పవాడు కావాలని ఆ పసిబాబు తండ్రి అన్నారు. ఈ సందర్భంగా పలువురు బాలింతలతో ఎమ్మెల్యే మాట్లాడి వారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు.


–కెసిఆర్ కిట్టు ఇస్తే బాగుండు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కెసిఆర్ పుట్టిన పిల్లల క్షేమం కోసం కెసిఆర్ కిట్టును అందించే వారిని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఆ లోటు పిల్లలకు తెలుస్తుందని అన్నారు. ప్రభుత్వం కెసిఆర్ కిట్టును పేరు మార్చుకొని అయినా ఇచ్చి పుట్టిన పసి పిల్లలను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్,కౌన్సిలర్ గందె శ్రీనివాస్, ముత్యంరాజు తదితరులు పాల్గొన్నారు.
j






