Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జూలై 28: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామంలో నమస్తే తెలంగాణ ఆర్ సి రిపోర్టర్ గూడూరి కొండల్ రెడ్డి తల్లి గూడూరి లక్ష్మి ఇటీవల మరణించగా ఆయన కుటుంబాన్ని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. అమ్మ మరణించిన తీరుపై వారిని పాలు వివరాలు అడిగి తెలుసుకొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, భగవంతుడు వారికి ధైర్యాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజురాబాద్ మున్సిపల్ 3వ వార్డ్ కౌన్సిలర్ గందె శ్రీనివాస్, సీనియర్ బిఆర్ఎస్ నాయకులు ఇరుమల్ల సురేందర్ రెడ్డి, కాటిపెల్లి తిరుపతిరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొండల్ రెడ్డి, రాజు, అతని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఉన్నారు.

నమస్తే తెలంగాణ ఆర్ సి రిపోర్టర్ గూడూరి కొండల్ రెడ్డినీ అమ్మ మృతిపై వివరాలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..





