
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి, రాజపల్లి, చెల్పూర్, బొత్తలపల్లి, పెద్దపాపయ్యపల్లి, కాట్రపల్లి గ్రామాల్లో లబ్ధిదారుల ఇండ్లకు స్వయంగా వెళ్లి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు.



అనారోగ్యం, ప్రమాదాలు వంటివి జరిగి క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబాలకు CMRF ఆర్ధిక సహాయం వారి గడప వద్దకే చేరేలా చేసి, బాధిత కుటుంబాలకు ధైర్యం నింపారు. ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రతి సందర్భంలో అండగా నిలవడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యతగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.




ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తాను. ప్రజల విశ్వాసమే నాకు బలం. వారి సేవ చేయడమే నా బాధ్యత, సంక్షేమమే నా లక్ష్యం” అని అన్నారు.



ప్రజలకు అవసరమైన ప్రతి సమయంలో అండగా నిలుస్తూ, ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రతి ఇంటి గడపకు చేర్చడంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, అభివృద్ధి–సంక్షేమమే ఎజెండాగా ముందుకు సాగుతున్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ M.D జావెద్, PACS చైర్మన్ ఎడవల్లి కొండాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఇరుమల్ల సురేందర్ రెడ్డి, KDCCB బ్యాంక్ వైస్ చైర్మన్ పింగళి రమేష్, మాజీ ఎంపీపీ వెంకటేష్, ఆయా గ్రామల సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు, పాల్గొన్నారు.





