
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాల విద్యార్థులు బుధవారం రోజున జమ్మికుంటలోని స్పందన అనాధాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు తీసుకొచ్చినటువంటి బహుమతులు, దుస్తులను అనాధాశ్రమంలో చదువుతున్నటువంటి విద్యార్థులకు అందజేశారు.


ఈ సందర్భంగా స్పందన అనాధాశ్రయాన్ని నిర్వహిస్తున్న వీరస్వామి మాట్లాడుతూ.. ఆల్ఫోర్స్ విద్యార్థులు మా అనాధాశ్రమాన్ని సందర్శించి ఆల్ఫోర్స్ విద్య సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను జరిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆల్ఫోర్స్ విద్యార్థులు ఇచ్చినటువంటి బహుమతులు మరియు దుస్తులు మా పిల్లలకి ఉపయోగపడతాయన్నారు. అలాగే అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.


ఆ తర్వాత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత పేరు మీద పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


ఆల్ఫోర్స్ పాఠశాల మొక్కలు నాటుతున్న చిన్నారులు..





