
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిఘనంగా. ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లిలో గల వైఎస్ఆర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ఆర్ చేసిన అభివృద్ధి పనులను వారు గుర్తు చేసుకున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజల కోసం ప్రవేశపెట్టి అమలుపరిచి పాలనలో చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని, కౌన్సిలర్స్, కో ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమాను, ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైయస్సార్ అభిమానులు..

నివాళులర్పిస్తున్న ముస్లిం మైనార్టీ నాయకులు..





