Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నిరుద్యోగుల గురుంచి మాట్లాడే నైతిక హక్కు బిఆర్ఎస్ పార్టీకి, ఆ నాయకులకు లేదనీ.. గతంలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం బిఆర్ఎస్ నేతల పాపమే కాదా❓ అని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకుడు మహ్మద్ ఇమ్రాన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. TGPSC పేపర్లు బజార్లో అంగడి సరుకుగా చేసి లీక్ చేసింది BRS పాలనలో కాదా అని గుర్తు చేశారు. ఏ నోటిఫికేషన్ వేసిన కోర్ట్ మెట్లు ఎక్కింది BRS హయంలో కాదా అని పేర్కొన్నారు. నిరుద్యోగ బృతి ప్రకటించిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క నిరుద్యోగికి బృతి చెల్లించిన దాఖలాలు లేవన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసానికి నాటి నిరుద్యోగులు ప్రవళిక, సునీల్ నాయక్ ల ఆత్మ హత్యలకు పాల్పడడానికి కారణం నాటి మీ BRS ప్రభుత్వ హాయంలో కాదా అని ఇమ్రాన్ గుర్తు చేశారు. అంతేగాక ప్రవళిక ఆత్మహత్యను అవహేళన చేసింది అప్పటి మంత్రి KTR కాదా అని, ప్రవళిక TGPSC లో one time రిజిస్ట్రేషన్ కూడా లేదు తనకి అని అన్నది ఎవరు గుర్తు చేసుకోవాలన్నారు.
ఇంటర్మీడియట్ మూల్యాంకణంలో అవకతవాకలు జరిగింది వాస్తవం కాదా అని ఆయన తెలిపారు. మీరు చేసిన తప్పుడు మూల్యాంకణంతో 26మంది ఇంటర్ విద్యార్థులు బల్వన్మరణాలకు కారణం నాటి BRS ప్రభుత్వంలో కాదా అని పేర్కొన్నారు. కొత్త జోనల్ వ్యవస్థను తీసుకవచ్చి హైదరాబాద్ ను మన రాష్ట్రానికి ఫ్రీ జోన్ చేయాల్సింది పోయి అన్ని రాష్ట్రాలకు ఫ్రీ జోన్ చేసింది వాస్తవం కాదా అని కేటీఆర్ ను నిలదీశారు. అంతేగాక గురుకులాలు తెచ్చి అద్దె భవనాల్లో పెట్టింది నాటి కెసిఆర్ ప్రభుత్వమేనని అన్నారు. నేడు విద్యార్థుల స్కాలర్షిప్లపై కపట ప్రేమ నటిస్తున్నరె కానీ, నాటి విద్యార్థుల స్కాలర్షిప్ లను నిలిపివేసింది BRS ప్రభుత్వం కాదా అని గుర్తు చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను చులకనగా చూసింది అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
నాటి మీ పాలనలో పేపర్ లీకులు, కానరాని నోటిఫికెషన్స్, కోర్ట్ పంచాయితీలు, నిరుద్యోగుల ఆత్మ హత్యలు, ఇంటర్ పిల్లల బల్వన్మరణాలు, భవనాలు లేని గురుకులాలు, విద్యార్థులకు అర కోర మెస్ చార్జీలు వెరసి నాటి BRS ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోయిందని ఇమ్రాన్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరుద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల కపట ప్రేమ నటిస్తూ ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు.
మీకు నిరుద్యోగుల గురుంచి మాట్లాడే అర్హత ఇప్పుడు కేటీఆర్ కు లేదని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తున్న ఉద్యోగాలు, విద్యార్థులకు నిరుద్యోలకు కల్పిస్తున్న సౌకర్యాలను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని ఇమ్రాన్ హితవుపలికారు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై గాని, సీఎం రేవంత్ రెడ్డి పై గాని అనవసర ఆరోపణలు చేస్తే కేటీఆర్ కు కాంగ్రెస్ నేతలు, ప్రజలు, నిరుద్యోగులు తగిన బుద్ధి చెప్తారని ఇమ్రాన్ హెచ్చరించారు.





