
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ చార్జీ చేయడం, ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ హుజురాబాద్ లో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పంజాల అరవింద్ గౌడ్, ఎన్ఎస్ యుఐ ల ఆధ్వర్యంలో ప్రధాని మోడీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధానుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…పేపర్ లీకేజీతో ఎంతోమంది విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయని ప్రభుత్వ నిర్లక్ష్యం తేటతెల్లమైందన్నారు. లీకేజీ కి బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థులు నిరసన తెలుపుతుంటే పోలీసులతో లాఠీచార్జి చేయడం, విద్యార్థులకు మద్దతుగా ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీ ని ఆరెస్ట్ చేయడం దారుణం అన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా NSUI నాయకులు ఉమ్మడి సందీప్, ప్రశాంత్ యాదవ్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సజ్జు, NSUI జిల్లా నాయకులు పసునూటీ అన్వేష్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మేకల రాజ్ కుమార్, చల్లూరి విష్ణువర్ధన్, బాలసాని సుమన్, సందీప్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శులు బండ నవీన్, శనిగరపు తరుణ్, NSUI నాయకులు గుండేటి మహేష్, బాబర్, అభిలాష్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.
@లోకల్ యాడ్స్@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలుపుతున్న వారు: శ్రీ గోస్కుల వివేక్ గారు పిఎసిఎస్ సెక్రటరీ హుజురాబాద్, జిల్లా కరీంనగర్.





