
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భగత్ నగర్ లో బుధవారం అర్థరాత్రి ఇదే కాలనీకి చెందిన అజ్మాత్ ఆలీ ఇంటిలోకి చొరబడిన 5గురు దోపిడి దొంగలు ఇంట్లోని వారిని బొమ్మ తుపాకులతో బెదిరించి, గదిలో బంధించి 15 లక్షల రూపాయల నగదు, 65 తులాల బంగారం, కిలో వెండి దోపిడికి పాల్పడిన దొంగలు అక్కడే ఇంటి ముందు పార్కింగ్ చేసిన రెండు మోటార్ సైకిళ్ళ పై పారిపోయిన సంఘటన యావత్ కరీంనగర్ పాత జిల్లా పరిధీలో బుధవారం ఉదయం సంచలనం సృష్టించింది.


ఈ సంఘటన పై కరీంనగర్ పోలీస్ కమీషనర్ మహ్మద్ గౌస్ అలం దర్యాప్తు చేస్తున్న తరుణంలోనే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి గ్రామ శివారులోని ఎస్ఆర్ఎస్పి కెనాల్ వద్ద రెండు మోటార్ సైకిళ్ళను గుర్తించిన గ్రామస్థులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి, సిఐలు జి. కరుణాకర్, శ్రీనివాస్ లు గాలింపు చర్యలు చేపట్టగా కరీంనగర్ నుండి డిసిపి వెంకటరమణ, సిఐ కోటేశ్వర్, పోలీస్ బృందాలతో పాటు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. కరీంనగర్ లో దోపిడికి పాల్పడిన 5గురు దొంగలు దోపిడి సొత్తుతో పాటు 2 మోటార్ సైకిళ్ళను దొంగలించి ఈ ప్రాంతంలో వదిలి వెళ్ళడం, దొంగలు ఈ ప్రాంతానికి చెందినవారా..?? లేక పోలీసులను తప్పుదారి పట్టించేందుకు అక్కడి లోకల్ దొంగలే ఈ విధంగా పన్నాగం పన్నారా..?? అన్న కోణంలో పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. కరీంనగర్ పట్టణంలోని జ్యూవెల్లరి షాపులో జరిగిన దొంగతనాన్ని మరిచిపోకముందే పట్టణ నడిబొడ్డున ఇంత పెద్ద దొంగతనాన్ని జరగడాన్ని కరీంనగర్ పోలీస్ కమీషనర్ మహ్మద్ గౌస్ అలం తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ దోపిడి ముఠాను పట్టుకునేందుకు సిపి గౌస్ అలం 11 పోలీస్ గాలింపు బృందాలను రంగంలోకి దింపారు. హుజురాబాద్ ప్రాంతంలో మోటార్ సైకిళ్ళు లభించడంతో పోలీస్ బృందాలు ఉప్పల్ రైల్వే స్టేషన్, జమ్మికుంట రైల్వే స్టేషన్, బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్లతో పాటు ఆర్టీసి బస్టాండ్ లలో ఉన్న సిసి కెమెరాల ఫుటేజీలతో పాటు కరీంనగర్ నుండి హుజురాబాద్ వరకు ఉన్న మానకొండూరు, శంకరపట్నం, హుజురాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని సిసి కెమెరాల ఫుటేజీలను పోలీస్ బృందాలను నిషితంగా పరిశీలిస్తున్నాయి. అతి తొందరలోనే దోపిడికి పాల్పడిన 5గురు సభ్యుల ముటాను పట్టుకుంటామని పోలీస్ గాలింపు బృందాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.



హుజురాబాద్ ప్రాంతానికి కరీంనగర్ దోపిడికి సంబంధం పై పోలీస్ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ దోపిడీ దొంగలు ఉపయోగించిన వాహనాలు హుజురాబాద్ లో లభించడం చర్చనీయాంశంగా మారింది.
&లోకల్ యాడ్స్&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ గోస్కుల వివేక్ గారు, పిఎసిఎస్ సెక్రటరీ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





