
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి పెంపొందాలని మాంటిస్సోరి ప్రిన్సిపాల్ గీతా షాజు అన్నారు. బుధవారం హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీలో గల మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో విద్యార్థులు ఉత్సాహంగా మాక్ ఎన్నికల్లో పాల్గొన్నారు.



ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ మాక్ పోలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోలింగ్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్ పాత్రలను సమర్ధవంతంగా పోషిస్తూ నిజమైన ఎన్నికల వాతావరణాన్ని సృష్టించారన్నారు. ఓటు వేయడం బ్యాలెట్ విధానం ఓటు లెక్కింపు వంటి అంశాలపై ప్రత్యక్షంగా ప్రదర్శించారన్నారు.



ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ షాజూ థామస్, గండ్ర సుధాకర్ రెడ్డి, నూకల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: గోస్కుల వివేక్ గారు, పిఎసిఎస్ సెక్రటరీ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





