
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హుజురాబాద్ మండల, పట్టణ బిఎల్ఏలతో సమగ్ర ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియ(సర్) పై హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఇప్పటివరకు వార్డు, గ్రామాల్లో మ్యాపింగ్, అన్ మ్యాపింగ్ సంబంధించి పూర్తి వివరాలు బిఎల్ఏ దగ్గర ఉండాలని సూచించారు. సమస్యలు ఉన్న దగ్గర సంబంధిత కో ఆర్డినేటర్లకు సమాచారం అందజేయాలని, త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేసి హుజురాబాద్ నియోజకవర్గాన్ని అగ్ర స్థానంలో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, మండల, పట్టణ అధ్యక్షులు, వార్డ్ అధ్యక్షులు, బిఎల్ఏలు పాల్గొన్నారు.

సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్..
#లోకల్ యాడ్స్#
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

:శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీ కంచి వేణు గారు, ఎంవిఐ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





