
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గత రెండు దశాబ్దాలుగా ఐపీఎస్ ఆఫీసర్గా సేవలు అందించి, గురుకులాల కార్యదర్శిగా ఎంతోమంది పేద బిడ్డల భవిష్యత్తులో వెలుగులు నింపి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పని చేస్తూ ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను తగ్గించడాన్నీ వ్యతిరేకిస్తూ ఈరోజు హుజురాబాద్ లో బీసీ సంఘాలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వేరో మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి అకినపల్లి శిరీష మాట్లాడుతూ.. అయితే అధికారిగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సేవలందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతకు ప్రమాదం ఉందని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా భద్రత తొలగించడం బుల్లెట్ ప్రూఫ్ కారు తొలగించడం సరికాదన్నారు. తక్షణమే ఆయనకు భద్రత పెంచి బుల్లెట్ ప్రూఫ్ కారు అందించాలని లేనిపక్షంలో ఆర్ఎస్పీకి ఏమి జరిగినా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో స్వేరో మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి అకినపల్లి శిరీష, బిసి జేఏసీ గౌరవ అధ్యక్షుడు సందుపట్ల జనార్దన్, జేఏసీ అధ్యక్షులు సందేల వెంకన్న, స్వేరో రాష్ట్ర కార్యదర్శి గడిప రాజు, జేఏసీ ప్రధాన కార్యదర్శి చిలుకమారీ శ్రీనివాస్, జేఏసీ మహిళా రాష్ట్ర జనరల్ సెక్రటరీ దేవసాని ప్రియదర్శిని, సృజన, కొలిపాక క్రాంతి, మామూనూరి ప్రవీణ్, ఇతర నాయకులు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





