Oplus_16908288
–విజిలెన్స్ దాడులలో వివక్ష ఎందుకు.
–పెద్దలను వదిలి.. చిన్న రైస్ మిల్లులపై కేసులా!?
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల అధికారులు పెద్దఎత్తున అక్రమాలు చేసిన వారిని వదిలి చిన్న రైస్ మిల్లుల మీద దాడులు చేసి కేసులు పెట్టి పెద్దవారిని వదిలి పెడుతున్నారని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పెద్దలు నిర్వహించిన సమీక్ష సమావేశంలో సివిల్ సప్లయ్ వ్యవస్థకు తూట్లు పొడిచిన వారిని, అనేక అక్రమాలకు అన్యాయాలకు పాల్పడిన వారిని పక్కన కూర్చోబెట్టుకుని సమీక్ష చేయడంలో అర్థం ఏమిటని వారు అన్నారు. కరీంనగర్ జిల్లాలో సివిల్ సప్లయ్ అధికారులు మరియు కొందరు బడా రైస్ మిల్లర్లు కుమ్మక్కై ప్రజాధనాన్ని దోచుకుంటున్న తీరును ప్రతిపక్ష పార్టీ కూడ ముగబోయయి అని ఇంతా పెద్దఎత్తున సియంఆర్ బియ్యం గల్లంతు కావడం అంటే దీనికి పూర్తి బాధ్యత అధికారులదేనని వారు అన్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అక్రమార్కులకు కట్టబెడుతున్న కరీంనగర్ సివిల్ సప్లయ్ అధికారుల తీరుపై ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.
ఏసీకే బకాయిదారులుటెండర్ నిబంధనల ఉల్లంఘన చేసి జిల్లాలో వందల ఏసీకే బకాయిలు ఉన్నప్పటికీ, 2022-23 రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం వేలంలో బకాయి డబ్బులు చెల్లించని వారికి మరియు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలలో ధాన్యం నిల్వ లేనట్లు తేలిన 25% పెనాల్టీ చెల్లించాలన్న నాటి సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూన్న వ్యక్తులకు మళ్లీ మళ్ళీ ధాన్యాన్ని కట్టబెట్టడంలో మతులాబు ఏమిటని వారు పేర్కొన్నారు.
చిన్న మిల్లర్లపై కక్షసాధింపు చర్యలు బడా మిల్లర్లకు నిబంధనలకు విరుద్ధంగా లాభం చేకురుస్తూ సామాన్య, చిన్న రైస్ మిల్లర్లపైన మాత్రం కావాలనే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం కేవలం 10 శాతం బ్యాంకు గ్యారంటీ తీసుకోవాలని స్పష్టమైన సర్క్యులర్ జారీ చేసినప్పటికీ జిల్లాలో ఆనిబంధనను పక్కనపెట్టి అధికారుల అలసత్వం ప్రదర్శించడం వెనుక భారీ కుట్ర కోణం దాగి ఉందని ఆయన ఆరోపించారు.
కొన్ని రైస్ మిల్లులలో స్టాక్ లేకుండానే అక్రమ షిఫ్టింగ్ కొంతమంది బడా రైస్ మిల్లర్ల వద్ద ధాన్యం నిల్వ లేకపోయినా, ఉన్నట్లు చూపించి 25% పెనాల్టీ పడకుండా పెద్ద ఎత్తున షిఫ్టింగ్ చేస్తూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారుల పైన త్వరలోనే ఆధారాలతో సహా పిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. కావున జిల్లా కలెక్టర్ వెంటనే ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, సమగ్ర విచారణ జరిపించి, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారులపై మరియు మిల్లర్లపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ అంకం శివరాణి, జిల్లా నాయకులు రంగరవేణి లక్ష్మణ్, శ్రీరాముల రమేష్, కుతాడి శ్రీనివాస్, గర్షకుర్తి విద్యాసాగర్, నూతి చరణ్ తదితరులు పాల్గొన్నారు.
@&లోకల్ యాడ్స్@&
హుజురాబాద్ జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో వృత్తి విద్య ఉపాధ్యాయుడుగా పనిచేసి పదవీ విరమణ పొందిన మ్యాక రాములు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు.

@శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: రిటైర్డ్ పిడి సొల్లు సారయ్య, హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.@





