
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నాటిన ప్రతి మొక్కను ప్రతి ఒక్కరు సంరక్షించాలనీ హుజురాబాద్ పురపాలక సంఘం 26వ వార్డులో మొక్కలు పంపిణీలో స్థానిక కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య పిలుపు నిచ్చారు. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 26 వార్డులో గురువారం ఉదయం వార్డులో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 26 వార్డు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య ఆద్వర్యంలో మొక్కలు పంపిణీ చేశారు. పూలు, పండ్లు తదితర రకాల మొక్కలు ఇవ్వడం జరిగింది. మొక్కలు నాటడం ద్వారా ఇంటి ఆవరణలో శుభ్రంతో పాటు, ఆక్సిజన్ ఇవ్వడానికి దోహదం చేసేందుకు మొక్కలు ఎంతో కీలకంగా నాటాలని, ఏ ప్రభుత్వం అయినా చెట్లు పెంపకానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కౌన్సిలర్ లావణ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

వార్డు ప్రజలకు మొక్కలు పంపిణీ చేస్తున్న కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య..

మొక్కల పంపిణీని పర్యవేక్షిస్తున్న కౌన్సిలర్ భర్త నరసింహారెడ్డి..



ఎంతో ఉత్సాహంగా మొక్కలు తీసుకెళ్తున్న వార్డు ప్రజలు…





