
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : తను ఉద్యోగం చేసినంత కాలం అంకితభావంతో విద్యార్థులకు బోధన చేసిన ఉత్తమ ఉపాధ్యాయుడు మ్యాక రాములు విద్యా రంగానికి చేసిన సేవలు ఎనలేనివని పలువురు వక్తలు అన్నారు. బుధవారం హుజురాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో వృత్తి విద్య ఉపాధ్యాయుడుగా పనిచేసి పదవీ విరమణ పొందిన మ్యాక రాములు సన్మాన కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ…. సుదీర్ఘకాలం విద్యారంగంలో పని చేసిన రాములు ఉపాధ్యాయ లోకానికి మార్గదర్శకుడని, ఆయన తన విద్యుక్త ధర్మం ను శ్రద్ధతో బాధ్యతగా చేశాడని పలువురు వ్యక్తులు కొనియాడారు. ఈ సందర్భంగా రాములు దంపతులను ఉపాధ్యాయులు, విద్యార్థులు, అతిథులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం బి తిరుమల, భీమదేవరపల్లి ఎంఈఓ మారేపల్లి సునీత, రిటైర్డ్ పిడి సొల్లు సారయ్య, పిఆర్ టియు నాయకులు, ఉపాధ్యాయులు మాధవరావు, భాగ్యరేఖ, వేల్పుల రత్నం, ఇమ్మడి సంపత్ కుమార్, ఆసియా, అర్చన, మాధవీలత, శ్రీలత, శోభారాణి, మారుతి, ప్రసాద్, స్వామిరావు, నందం, రాజు, శారద, రాజు, రాజకుమార్, రాములు కుటుంబ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
. &లోకల్ యాడ్స్&
హుజురాబాద్ జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో వృత్తి విద్య ఉపాధ్యాయుడుగా పనిచేసి పదవీ విరమణ పొందిన మ్యాక రాములు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: రిటైర్డ్ పిడి సొల్లు సారయ్య, హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





