
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పురపాలక సంఘం
20వ వార్డులో మెహందీ వేడుకలు కన్నుల పండువగా సాగాయి. వార్డు పరిధిలోని మహిళలు, యువతులు విశేష సంఖ్యలో పాల్గొనడంతో ప్రాంగణమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది.



ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక వార్డు కౌన్సిలర్ దామెర అనూష అనురాగ్, వేడుకల్లో పాల్గొన్న ఆడపడుచులందరికీ పసుపు, కుంకుమలు, గాజులు బహుకరించి తమ సొంత ఇంటి ఆడపడుచుల్లా ఆత్మీయంగా ఆదరించారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ దామెర అనూష అనురాగ్ మాట్లాడుతూ.. వార్డులోని మహిళలందరినీ ఒకే చోటకు చేర్చి, మన సాంప్రదాయాలను గౌరవిస్తూ ఇలాంటి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషాన్నిస్తుందన్నారు. వార్డు ప్రజల సంక్షేమం, మహిళల ఆత్మగౌరవానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు.
కౌన్సిలర్ చూపిన ఆప్యాయత, ఇచ్చిన ఆత్మీయ సత్కారాలకు వార్డు మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్య నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
& లోకల్ యాడ్స్ &
హుజురాబాద్ జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో వృత్తి విద్య ఉపాధ్యాయుడుగా పనిచేసి పదవీ విరమణ పొందిన మ్యాక రాములు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: రిటైర్డ్ పిడి సొల్లు సారయ్య, హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





