
—హుజురాబాద్ మున్సిపాలిటీ అక్రమాల పర్వంపై బీజేపీ సమరశంఖం…
—బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి వెల్లడి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని, కాంగ్రెస్ విధేయులకే ఇళ్లు మంజూరు చేశారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం రోజున బిజెపి హుజూరాబాద్ మున్సిపల్ ఫ్లోర్, కౌన్సిలర్ లమీటింగ్ జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..
మున్సిపాలిటీ పాలన అవినీతికి అడ్డాగా మారిందని మండిపడ్డారు.
నిజమైన నిరుపేదలు, అర్హులైన లబ్ధిదారులను పక్కనబెట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లను కేటాయించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్హులైన పేదల హక్కులను కాలరాస్తూ, కేవలం అనర్హులకు అధికార కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నవారికే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేశారని ఆరోపించారు.పేద ప్రజలకు చెందాల్సిన ఇళ్లను అన్యాక్రాంతం చేస్తున్న అధికారుల తీరుపై బీజేపీ చూస్తూ ఊరుకోదని, త్వరలోనే బాధితులకు మద్దతుగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి సమరశంఖం పూరిస్తామని హెచ్చరించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇండ్లు వచ్చే వరకు పోరాటం ఆపేదిలేదని ఆయన హెచ్చరించారు.
కార్యక్రమంలో మాజీ జెడ్పి చైర్ పర్సన్ కనుమల విజయ బిజెపి పట్టణ అధ్యక్షులు తుర్పాటి రాజు, హుజురాబాద్ బిజెపి కౌన్సిలర్లు కొలుగురి సుమలత, దామెర అనూష అనురాగ్, పంజాల మనోజ్, కొండ ప్రశాంతి, మంచికట్ల మురళి, దామర అనురాగ్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు.
#లోకల్ యాడ్స్#
హుజురాబాద్ జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో వృత్తి విద్య ఉపాధ్యాయుడుగా పనిచేసి పదవీ విరమణ పొందిన మ్యాక రాములు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: రిటైర్డ్ పిడి సొల్లు సారయ్య, హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





