Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గత సంవత్సరం తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “ధాయ్ ఆకార్ లెటర్ రైటింగ్ కాంపిటీషన్ 2025-26”, లెటర్ టూ రోల్ మోడల్ అంశంలో జాతీయ స్థాయిలో హుజురాబాద్ లోని టెట్రా హెడ్రన్ పాఠశాలకు చెందిన విద్యార్థి శ్రీ సిద్దార్థ్ ప్రథమ బహుమతి పొందగా ఆ పాఠశాల కరస్పాండంట్ ముచ్చ నారాయణరెడ్డి, సయ్యద్ అజారోద్దీన్, అసిస్టెంట్ సూపరిండెంట్ హుజురాబాద్ సబ్ డివిజన్, పోస్ట్ మాస్టర్ అమర్నాథ్, హుజురాబాద్, పాఠశాల డైరెక్టర్ లు రాజి రెడ్డి, రమణారెడ్డి, సంపత్ రెడ్డి, సంజీవ రెడ్డి, సంతోష్ రావు, పాఠశాల అడవైజర్ సత్యనారాయణ మరియు ప్రిన్సిపాల్ నరేష్ అభినందనలు తెలుపుతూ అక్షరాలా ఇరువై ఐదు వేల రూపాయలు చెక్ రూపంలో అందించారు. విద్యార్థులను ఉద్దేశించి కరస్పాండెంట్ మాట్లాడుతూ.. భవిష్యత్ లో ఇలాంటి మరెన్నో పోటీ పరీక్షలలో పాల్గొని విజయవంతులు కావాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు సమాజంలో మంచి పౌరులుగా తీర్చి దిద్దడమే మా పాఠశాల లక్ష్యం అని వివరించారు.
@లోకల్ యాడ్స్@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: న్యూ శాతవాహన హై స్కూల్, సూపర్ బజార్ రోడ్(ఇందిరా మార్గ్) హుజూరాబాద్, కరీంనగర్ జిల్లా.





