Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ఎంతోకాలంగా అపరిస్కృతంగా ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం హుజురాబాద్ తాసిల్దార్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ కదిరే రమేష్ మాట్లాడుతూ…. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు సమీపిస్తున్న ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలు నిలబెట్టుకోవడం లేదన్నారు. హమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఎలాంటి సమస్యలు పరిష్కరించలేదనీ అన్నారు.
హమాలి కార్మికులకు హెల్త్ కార్డులు జారీ చేసి ఉచిత వైద్య సేవలు అందించాలనీ, ప్రభుత్వం చే 55 సంవత్సరాలు కార్మికుల అందరికీ, ప్రతి ఒక్కరికి రూ.6000 పింఛను ఇవ్వాలి. ఇండ్లు లేని హమాలీ కార్మికుల అందరికీ ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేసి 120 గజాల స్థలంలో ఇల్లు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో హమాలి సంఘం ఉపాధ్యక్షులు రాచపల్లి సారయ్య, రాచపల్లి శంకర్, కొడిమెల వెంకటేష్, మోర్ మహేష్, రాచపల్లి లింగయ్య, కనకం రాజు, ప్రభాకర్, శ్రవణ్ కుమార్, ప్రభు, శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
##లోకల్ యాడ్స్ ##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ బత్తుల మనోజ్ గారు అధ్యక్షులు, సాహస హెల్ప్ సొసైటీ హుజురాబాద్ మరియు అలయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





