
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి (సింగాపూర్) హుజూరాబాద్: విద్యార్థుల కెరీర్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సింగాపూర్‌లోని వీఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో CPBFI (బ్యాంకింగ్, ఫైనాన్స్ మరియు ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ )కోర్సు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రుబికాన్ ఫౌండేషన్ & బజాజ్ ఫిన్సర్వ్ సీనియర్ ట్రైనర్ అభిషా బ్లెస్సీ విద్యార్థులకు CPBFI (బ్యాంకింగ్, ఫైనాన్స్ మరియు ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ )కోర్సు ప్రాముఖ్యత, శిక్షణ విధానం మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలోని కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించారు.

120 గంటల శిక్షణా కార్యక్రమంగా రూపొందించిన ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్ అందించబడుతుంది. విద్యార్థుల భవిష్యత్ కెరీర్‌కు ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని కళాశాల యాజమాన్యం ఎంతో ముందుచూపుతో తీసుకున్న నిర్ణయంగా అభినందనలు అందుకుంటోంది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అజయ్ కుమార్ పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులు కూడా కార్యక్రమంపై ఎంతో ఆసక్తి చూపిస్తూ చురుకుగా పాల్గొన్నారు. త్వరలోనే కళాశాలలో CPBFI (బ్యాంకింగ్, ఫైనాన్స్ మరియు ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ )శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.






