
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మండల అవొపా నూతన అధ్యక్షులుగా హుజురాబాద్ పట్టణానికి చెందిన అయిత లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం శ్రావణమాసం సందర్భంగా వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా పుల్లూరి శ్రీనివాస్, కోశాధికారిగా గౌరీశెట్టి సాoబమూర్తిలు ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు అవొపా జిల్లా అధ్యక్షులు కొమరవెల్లి వెంకటేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో అవోపా నాయకులు శివనాథుని ఈశ్వరయ్య, శివరాత్రి ఈశ్వరయ్య, ఎస్ రాజమొగిలి, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
— విరివిగా సేవా కార్యక్రమాలు
అవోపా ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు, ఆర్యవైశ్యులకు గుర్తింపునిచ్చే కార్యక్రమాలు చేపడతామని నూతన అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు.





