
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : చిన్ననాటి స్నేహానికి విలువనిస్తూ పేద బాల్యమిత్రుడు చనిపోతే ఆర్థిక సహాయం అందజేసి బాల్యమిత్రులు తమ సహృదయతను చాటుకున్నారు. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి హైస్కూల్లో 1991 లో ఏడవ తరగతి చదివిన పిల్లలు తమ బాల్యమిత్రుడైన కొండపర్తి రాజేందర్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా 20వేల రూపాయలు ఆదివారం ఆయన ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయం చేశారు.

కొండపర్తి రాజేందర్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేస్తున్న చిన్ననాటి మిత్రులు..
గత కొంతకాలంగా పేదరికంతో బాధపడుతు జీవితాన్ని కొనసాగిస్తూ ఇబ్బందులు పడుతున్న రాజేందర్ కుటుంబ పరిస్థితి తెలుసుకున్న ఆయన మిత్రులు తమ మిత్రుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆలోచించి ఆదివారం మిత్రులందరి తరపున 20వేల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా రావుల వేణు మాట్లాడుతూ… తమతో పాటు చదువుకున్న వారిలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్న ఇతర బాధల్లో ఉన్న తమ వంతు సహాయంగా ఏదో ఒక విధమైన సహాయాన్ని మిత్రులంతా కలిసి అందిస్తున్నామని అన్నారు. ఇప్పటికీ గత పది సంవత్సరాలుగా ఎవరికో ఒకరికి తమ మిత్రులకు వివిధ రకాల సహాయాన్ని అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్ననాటి మిత్రులు మంచికట్ల కోటిలింగం, జూపాక నరసింగం, కేశబోయిన సంపత్, పిట్ట నరసింగం, అంగీరక కిషన్, ఉప్పు రాజేందర్, ముక్క నర్సింగం తదితరులు పాల్గొన్నారు.





