
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో వినియోగదారులకు నాణ్యమైన, తాజా స్వీట్స్, పొడి పండ్లను (డ్రై ఫ్రూట్స్) అందుబాటులోకి తెస్తూ స్థానిక పాపారావు బొంద కూడలి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అతి పెద్ద స్వీట్ షాప్ “అంబాజీ స్వీట్స్, డ్రై ఫ్రూట్స్” షాప్ ను బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని, స్థానిక 26వ వార్డు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డిల చేతుల మీదుగా వైభవంగా ప్రారంభమైంది. స్థానిక ముఖ్య అతిథులు మరియు ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి ఈ విక్రయ కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించారు.


అంబాజీ స్వీట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ షాపును ప్రారంభిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని కౌన్సిలర్ లావణ్య తదితరులు..
ఈ సందర్భంగా నిర్వాహకులు రాజు పాండే ఉమాదేవి దంపతులు మాట్లాడుతూ, 1998లో సూపర్ బజార్ రోడ్లో చిన్న స్వీట్ షాప్ ఓపెన్ చేశామన్నారు. వినియోగదారుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన కాజూ, బాదం, పిస్తా, అంజీర్, వాల్నట్స్, కిస్మిస్లతో పాటు వివిధ రకాల ఆర్గానిక్ మరియు ఇంపోర్టెడ్ డ్రై ఫ్రూట్స్, నట్స్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. శుభకార్యాలు, పండుగల వేళల్లో ప్రత్యేక గిఫ్ట్ ప్యాక్‌లు కూడా ఇక్కడ లభిస్తాయని పేర్కొన్నారు.
పట్టణ ప్రజలు తమ నూతన స్టోర్‌ను సందర్శించి ఈ సేవలను వినియోగించుకోవాలని యజమానులు కోరారు.

షాపు యజమానులు రాజు పాండే ఉమాదేవి దంపతులను సన్మానించి జ్ఞాపకం చేస్తున్న చైర్పర్సన్, కౌన్సిలర్..

స్థానిక కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డి దంపతులను సన్మానిస్తున్న షాపు యాజమానులు..
ఈ కార్యక్రమంలో స్థానిక వ్యాపారులు, ప్రజాప్రతినిధులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.





