
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రారంభించిన వన మహోత్సవ కార్యక్రమం హుజురాబాద్ పట్టణం మండలంలో మంగళవారం ఘనంగా జరిగింది. పరమోత్సవం సందర్భంగా హుజూరాబాద్ పట్టణంలో కరీంనగర్ రోడ్ లో గల మహాలక్ష్మి కళ్యాణమండపం నుండి లవ్ హుజురాబాద్ వరకు మొక్కలు రోడ్డుకు రెండు వైపులా నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటి కాపాడాలన్నారు. హుజురాబాద్ మునిసిపాలిటీ పరిధిలో మొక్కలు నాటి పచ్చని హుజురాబాద్ గా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో
వైస్ చైర్ పర్సన్ గూడూరి అంజలి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కమిషనర్ బి. కిషన్, మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ పోలు వినయ్, వార్డు అధికారులు, సానిటరీ జవాన్లు, సిబ్బంది పాల్గొన్నారు.

మున్సిపల్ ఆధ్వర్యంలో వనమహోత్సవంలో మొక్కలు నాటి నీళ్లు పడుతున్న చైర్పర్సన్ సుహాసిని, కమిషనర్

–మండలoలో…..
హుజురాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో వన మహోత్సవం సందర్భంగా అధికారులు మొక్కలు నాటారు. రాంపూర్ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో మొక్కలు మొక్కలు నాటి పర్యావరణం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఎంపీడీవో తూర్పాటి సునీత, సర్పంచ్ ముషం సంగీత, ఎంపీఓ రాజేందర్ , ఇంజనీరింగ్ కన్సల్టెంట్ శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి మహేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






