
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : పట్టణంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారస్తులు బ్యాంకులు ఇచ్చే రుణాలను ఉపయోగించుకోవాలని హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ రోoటాల సుహాసిని కోరారు. మంగళవారం హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులు, బ్యాంకు అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. వ్యాపార అభివృద్ధి కోసం తీసుకునే రుణాలను సక్రమంగా వినియోగించుకొని ఆర్థిక అభివృద్ధి చెందాలని అన్నారు. పట్టణ అభివృద్ధిలో వీధి వ్యాపారులు తమ వంతు పాత్ర అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి కిషన్ మున్సిపల్ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వేణు , వివిధ వివిధ బ్యాంకుల మేనేజర్లు, సి ఎల్ ఆర్ పి ఎస్, ఆర్పీలు, ఓబీలు వెజిటేబుల్స్ వెండర్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


వీది వ్యాపారులు, మెప్మా సిబ్బంది, ఇతర అధికారులు





