
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన పుల్ల కరుణాకర్ ఐపీఎస్ హోదా రావడం పట్ల కుటుంబ సభ్యులు, ఉద్యోగ సంఘ నాయకులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలిపారు.

బుధవారం ఆయనను తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. మొదట ఏసిటివో గా ఉద్యోగం సాధించి తర్వాత గ్రూపు వన్ ద్వారా ఇంటిలిజెంట్ లో డిఎస్పిగా నియమితులయ్యారని తర్వాత అంచలంచలుగా ఎదిగి ఐపీఎస్ గా హోదా పొందడం సంతోషదాయకమని అన్నారు.

ఆయనకు ఐపీఎస్ హోదా రావడం పట్ల కరుణాకర్ సోదరి హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ రోoటాల సుహాసిని కార్యాలయ ఉద్యోగులు, సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేసి సంతోషం పంచుకున్నారు. అలాగే కుటుంబ సభ్యులు ఇందిరాదేవీ, అద్భుతరావు, శ్యామ్, బావ మనోజ్ రావు, రిటైర్డ్ టీచర్ పుల్ల పవన్ కుమార్, కరాటే మాస్టర్ ఐ.వి రమేష్ కుమార్, స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ సీఈవో మండల యాదగిరి, మున్సిపల్ జవాన్ రోంటాల సుధీర్, స్నేహితులు వడ్లకొండ అనిల్ కుమార్, హనుమంతాచారి, ఝాన్సీ ప్రసూన రాణి, దీప, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.





