Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ ఐఆర్ కార్యక్రమం రెండో విడతపై గురువారం హుజూరాబాద్ మునిసిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో బిఎల్ఓ లకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….మొదటి విడత ఎస్ ఐఆర్ లో ఓటర్ల దగ్గర తీసుకున్న గణన ఫారాలు తర్వాత దానిని డిజిటలైజేషన్ చేయడం జరిగిందని, అనంతరం చిన్నచిన్న పొరపాట్లు ఉన్నవారికి నోటీసులు అందిస్తున్నామని తెలిపారు. నోటీసులు అందుకున్న వారి నుండి సమాధానం తప్పనిసరిగా తీసుకోవాలని వారికి రసీదు ఇవ్వాలని సూచించారు. ఎలాంటి సందేహాలున్న ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, మండల రెవెన్యూ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ బాలకిషన్, మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ వాణి, రఘు, బిఎల్వోలు పాల్గొన్నారు.





