
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : రాఖీ పౌర్ణమి సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులతో రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హుజురాబాద్ పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, కాకతీయ జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు రాఖీలు కట్టి, రాఖీ పండుగ యొక్క ఆత్మీయత, సోదరభావాన్ని చాటుకున్నారు.
అదేవిధంగా విజ్ఞాన్, టెట్రా, మాంటిస్సోరి తదితర ప్రైవేట్ పాఠశాలల్లో కూడా విద్యార్థినులకు రాఖీలు అంద జేసి విద్యార్థినిలతో రాఖీ కట్టించి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ హుజురాబాద్ పట్టణ కార్యదర్శి పల్లె సాయిచరణ్ రెడ్డి, టెక్నికల్ సెల్ కన్వీనర్ మహేష్, ఉపాధ్యక్షులు మణి ప్రీతమ్, జాయింట్ సెక్రటరీ రాకేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, రక్షణకు ప్రతీక అని, విద్యార్థుల్లో సోదరభావం, సామాజిక బాధ్యత, భారతీయ సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులలో దేశభక్తి, సంస్కృతి, సేవాభావాన్ని పెంపొందించే కార్యక్రమాలను ఏబీవీపీ నిరంతరం నిర్వహిస్తుందని పేర్కొన్నారు.






