
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలను మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రజాపాలనపై ధర్నాలు చేయడం సిగ్గుచేటు అని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నేరెళ్ల మహేందర్ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జమ్మికుంట బహిరంగ సభలో నన్ను గెలిపిస్తే 1000 కోట్లతో నియోజకవర్గాన్ని అద్దంలా మెరిపించేలా అభివృద్ధి చేస్తానని చెప్పి వెయ్యి రోజులు గడుస్తున్న వెయ్యి రూపాయలు కూడా తీసుకురాని నువ్వు సిగ్గు లేకుండా రోడ్ల మీదకు వచ్చి నువ్వా కాంగ్రెస్ పార్టీని విమర్శించేది కౌశిక్ రెడ్డి అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయంలో కెసిఆర్ ఫోటో తొలగించాలనీ
వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలన్నారు. నువ్వు కేసీఆర్ ఫోటో పెట్టాలంటే ప్రభుత్వ అధికారిక క్యాంప్ కార్యాలయం ఖాళీ చేసి నీ సొంత కార్యాలయం పెట్టుకొని నీకు నచ్చిన ఫోటోలు పెట్టుకోవచ్చు లేదంటే ఆ ఫోటో తొలగించకపోతే మేమే తొలగించాలిసి వస్తుంది అని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను స్వయంగా లబ్ధిదారులకు అందజేస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పథకాలు అందడం లేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో ఒక్కవైపు ఇసుక ట్రాక్టర్ ల వల్ల రోడ్లు చెడిపోతున్నాయి అని ఫోటోలు ప్రదర్శిస్తున్నాడు, మరో వైపు ఇసుక దొరకక ఇబ్బంది పడుతున్నారు అని నంగనాచి మాటలు మాట్లాడుతున్నాడన్నారు.
తెరాస హామీలు దళిత ముఖ్య మంత్రి ఇచ్చిండ్రా.. నిరుద్యోగ భృతి ఇచ్చిండ్రా..మీహాయంలో ఎన్ని డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చిండ్రు, ఎంతమంది దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రు చెప్పి రోడ్డెక్కాలి అని హితవు పలికారు. జిల్లా కో సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ అన్నారు, ఉచిత నిర్భంద విద్యా కేజీ టూ పీజీ ఏమైంది ? అవినీతి సొమ్ము ఇంకా లెక్కపెట్టుకుంట్రుండ్రని ఒకవైపు కేసిఆర్ కూతురే చెబుతుంటే ఏ మొఖం పెట్టుకొని ధర్నాలు చేస్తుండ్రు అన్నాడు.
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తుంటే బిఆర్ఎస్ నాయకలు ఓర్వలేకపోతుండ్రు అని, అసెంబ్లీలో వెయ్యి నిమిషాలు కూడా మాట్లాడని కేసీఆర్ పై ముప్పై నెలల్లో ప్రతిపక్ష నేత హోదా వల్ల ప్రజాధనం 22 కోట్లు ఖర్చు అయ్యింది అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటి రామారావు హద్దులు దాటి మాట్లాడుతుండు అని, ఎలక్షన్స్ టైమ్ లో విలేకరులను మోసం చేసి సరైన స్థలంలో పట్టాలు ఇవ్వకపోవడంతో విలేకరులు ఇవ్వాళ రోడ్డు మీదకు వచ్చేలా చేసి రాజకీయ సర్కస్ చూస్తున్న కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ మీద విమర్శలు చేసే హక్కు కౌశిక్ తమ్మీ నీకు లేదు అన్నారు.
నియోజకవర్గంలో మా నాయకుడు ప్రణవ్ మంత్రులతో, ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదించుకుంటూ చేసిన ప్రతి పనిని నేనే చేసిన అని సిగ్గులేకుండా చెప్పుక తిరుగుతున్నవు అంటూ మహేందర్ ఆరోపణలు చేశాడు. నీకు నియోజకవర్గం అభివృద్ధి చేసే దమ్ము లేదు మీ మండలంలో కల్వల ప్రాజెక్టు మరియు చెల్పూరు పెద్ద చెరువు రిపైర్ చేపిస్తా అని చెప్పిన నువ్వు ఇప్పటి వరకు చెయ్య చాతగాలేదు నువ్వు మాట్లాడుతున్నావా సిగ్గులేకుండా అని మహేందర్ పేర్కొన్నారు.
ఇప్పటికైనా పద్దతి మార్చుకోండి నియోజకవర్గం అభివృద్ధి మీద ద్రుష్టి పెట్టండి.. చిల్లర మాటలు చిల్లర ప్రచారం బంజేయ్యి అని మహేందర్ హితవ్ పలికారు.




