
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు శుక్రవారం హుజురాబాద్ పట్టణంలో బిజెపి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, మొక్కలు నాటారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ దేశానికి, యువతకు అందించిన సేవలను గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, పట్టణ ప్రధాన కార్యదర్శులు తిప్పబత్తిని రాజు, గంట సంపత్, కౌన్సిలర్ లక్ష్మీదుర్గ, ఇల్లందుల ప్రణీత్, కుసుమ సమ్మయ్య, బోడిగే రాధా, శ్రీనివాస్, రామచంద్రం, విజయ్, రాజ్ కుమార్, రమేష్, సాయిరాం, ఐలయ్య, సురేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.





