
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామానికి చెందిన ఓసీ జేఏసీ మండల నాయకులు నాయినేని రవీందర్ రావు సతీమణి రజిత గుండెపాటుతో ఆకస్మికంగా మృతి చెందండం పట్ల తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆవేదన వ్యక్తం చేశారు.

శుక్రవారం పోలాడి రామారావు నాయకులతో కలిసి ఉప్పల్ గ్రామంలో వారి నివాసంలో మృతురాలు రజిత పార్తీవ దేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మృతురాలు భర్త రవీందర్ రావును వారి కుటుంబ సభ్యులను పోలాడి రామారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఓదార్చారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఓసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చందుపట్ల నర్సింహారెడ్డి, మండల ఓసీ జేఏసీ అధ్యక్షులు కొనిశెట్టి మునీందర్, హుజురాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ వర్ధినేని రవీందర్ రావు, బీ.ఆర్.ఎస్ నియోజకవర్గ ఇంచార్జి నాయినేని తిరుపతిరావు, సర్పంచులు వాల ప్రదీప్ రావు, పోలాడి శ్రీరంగారావు, కమలాపూర్ మండల ఎంపీటీసీల ఫోరమ్ మాజీ అధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, ఉప్పల్ మాజీ సర్పంచ్ ఎర్రబెల్లి దేవేందర్ రావు, పోలాడి యాదగిరిరావు, అన్నమనేని శ్రీనివాస్ రావు, తక్కళ్లపెల్లి దేవేందర్ రావు,పోలాడి రాంగోపాల్ రావు పలువురు సర్పంచులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు అంతిమ యాత్ర లో పాల్గొన్నారు.





