
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్ :
రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారులపై కొందరు స్వార్థపరులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని, ఈ నీచమైన ప్రవర్తనను వెంటనే మానుకోవాలని తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
సమర్థవంతమైన పాలన: ప్రిన్సిపాల్ సెక్రటరీగా ఎం. రఘునందన్ రావు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు సులభతరమయ్యాయని, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కారమవుతున్నాయని ముజాహిద్ హుస్సేన్ ప్రశంసించారు.
అధికారులపై దుష్ప్రచారం ఖండార్హం : ఎంతో నీతి నిజాయితీతో, ఉదయం 10:30 నుండి రాత్రి 9:00 గంటల వరకు కష్టపడి పనిచేస్తున్న అడిషనల్ కమిషనర్ మరియు ఒక సూపరింటెండెంట్‌పై కావాలని తప్పుడు ప్రకటనలు రాయిస్తూ బద్నామ్ చేయడానికి ప్రయత్నించడం బాధాకరమన్నారు.
సమస్యల పరిష్కారానికి అధికారుల రాకపోకలు.. శాఖాపరమైన పనుల నిమిత్తం జిల్లాల నుంచి అధికారులను పిలిపించుకోవడంలో ఎలాంటి తప్పులేదని, ఆన్లైన్ విధానం అందుబాటులో ఉన్నప్పటికీ దీనిపై వివాదాలు సృష్టించడం సరికాదని స్పష్టం చేశారు.
ఉద్యోగుల సంక్షేమం : హైదరాబాద్‌లో కొత్త జేసీ, సీటీవో కార్యాలయాలు మంజూరు చేయించిన ఘనత రఘునందన్ రావుకే దక్కుతుందని పేర్కొన్నారు. మన కుటుంబం లాంటి వాణిజ్య పన్నుల శాఖపై సొంతవారే దుష్ప్రచారానికి పాల్పడటం తగదు. ఇలాంటి పనులు చేస్తున్న వారు వెంటనే తమ ప్రవర్తనను మార్చుకోవాలి. లేనిపక్షంలో వారికి తగిన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది” అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ హెచ్చరించారు.



