Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల మాజీ కౌన్సిలర్ మారేపల్లి సుశీల తల్లి ఇల్లందుల లక్ష్మి మృతి చెందడంతో సోమవారం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆమె ఇంటికి వెళ్లి సుశీలను పరామర్శించారు. ఈ సందర్భంగా సుశీలతల్లి మృతికి కారణం తెలుసుకొని తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కౌన్సిలర్లు గందె శ్రీనివాస్, వర్ధినేని రవీందర్ రావు, బిఆర్ ఎస్ నాయకులు కొలిపాక శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, గఫార్ , అంజదుల్లా ఖాన్, కల్లేపల్లి రమాదేవి, ఎండి ఇమ్రాన్, కల్లేపల్లి రోషేందర్, మోలుగు పూర్ణచందర్, రమేష్, రేణుక, శంకర్ తదితరులు పాల్గొన్నారు.





