
—రైతులకు కోతలు లేని విద్యుత్ సరఫరా చేయాలి
వరి పంట కీలక దశలో విద్యుత్ కోతలు విధించడం సరికాదు
–బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బిజెపి హుజురాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో హుజురాబాద్ మండలంలోని రైతులకు విద్యుత్ కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ ఎన్పీడీసీఎల్ సహాయక ఇంజనీర్ (ఏఈ) రమేష్ కి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుతం వరి పంట కీలక దశలో ఉందని, విద్యుత్ కోతల కారణంగా రైతులు తమ బావులు, బోర్ల ద్వారా పొలాలకు అవసరమైన నీటిని అందించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా పంటలకు సరైన సమయంలో నీరు అందకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
రైతులు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలను కాపాడుకోవడానికి నిరంతర విద్యుత్ సరఫరా ఎంతో అవసరమని పేర్కొన్నారు. కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు రైతుల సమస్యను అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి, విద్యుత్ కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.

“విద్యుత్ కోతలు ఆపాలి – రైతుల పంటలు కాపాడాలి”, “కోతలు లేని విద్యుత్ – రైతులకు కావాలి” అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు తూముల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తిప్పబత్తిని రాజు, సీనియర్ నాయకులు నరాల రాజశేఖర్, దామెర అనురాగ్, హుజురాబాద్ బిజెపి ఉపాధ్యక్షులు ఇల్లందుల ప్రణీత్, ఓబిసి మోర్చా పట్టణ అధ్యక్షులు కొలిపాక వెంకటేష్, కార్యదర్శి కొడిమ్యాల పవన్ కుమార్, పట్టణ కోశాధికారి క్యాష వెంకటేష్, సోషల్ మీడియా కన్వీనర్ దాసరి వీరయ్య, మలుగూరి నగేష్, తుర్పాటి సురేష్, తుర్పాటి సమ్మయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





