
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు శుక్రవారం హుజురాబాద్ పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ రొoటాల సుహాసిని, వైస్ చైర్ పర్సన్ గూడూరి అంజలి, కమిషనర్ బి కిషన్, పాలకవర్గం కేసి క్యాంపులోని మహాత్మా గాంధీ విగ్రహానికి, హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ కలలుగన్న రామరాజ్యం గ్రామ స్వరాజ్యం కొనసాగించడానికి నేటితరం నాయకులు కృషిచేయాలనీ అన్నారు.




ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి సానిటరీ ఇన్స్పెక్టర్ బి కిరణ్, మునిసిపల్ అధికారులు పోలు వినయ్, ప్రతాప రాజు, రోంటాల సుధీర్, పి అనిల్ కుమార్, ఏ రమేష్, టి కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల శాఖ అధ్యక్షులు మేకల తిరుపతి, కే కిరణ్ కుమార్, మహిళా అధ్యక్షురాలు పుల్ల రాధ, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ తూర్పాటి లక్ష్మీ దుర్గ – రాజు గారు, 23వ వార్డు కౌన్సిలర్, బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు.





