Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: సామాజిక కార్యకర్త ప్రవీణ్ ఆరోరా ఆధ్వర్యంలో ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల కొరకు ఢిల్లీ నుంచి చేపట్టిన దేశ వ్యాప్త బస్సు యాత్రకు ఓసీ ఐకాస సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడించారు. శుక్రవారం మహాత్ముని జయంతి సందర్బంగా ఢిల్లీ రాజ్ ఘాట్ లో నివాళులు అర్పించి ప్రవీణ్ ఆరోరా ప్రారంభించిన దేశవ్యాప్త బస్సు యాత్ర కార్యక్రమానికి ఓసీ జేఏసీ తెలుగు రాష్ట్రాల ప్రతినిధులతో కలసి ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు హాజరై ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్లకు మద్దతు తెలిపారు. సమాజంలోని అన్ని సామాజిక వర్గాల పేదలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సమన్యాయం జరుగుటకు ప్రస్తుతం అమలవుతున్న కుల మత ప్రాధిక రిజర్వేషన్లు కాకుండా అన్ని సామాజిక వర్గాల్లో ఆర్ధిక ప్రాతి పదికన రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే తమ ఓసీ జేఏసీ ద్యేయం అని ఇదే మామూల సిద్ధాంతం అని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు. తమ ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ ఓసీ సంఘాల సమన్వయంతో ఏళ్ల తరబడి సంఘటితంగా పార్టీల కతీతంగా రాష్ట్ర, దేశవ్యాప్తంగా చేసిన అనేక పోరాటాల ఫలితంగా ఓసీల్లోని ఆర్థికంగా వెనుక బడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాల్లో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కల్పించిందన్నారు. తమ ఓసీ జేఏసీ ఏ ఇతర సామాజిక వర్గీయులకు గాని, ఏ మతానికి వ్యతిరేకం కాదని అన్ని సామాజిక వర్గాల్లోని పేదలందరికి విద్యా, ఉద్యోగ, ఉపాధి సంక్షేమ రంగాల్లో సమన్యాయం జరగాలన్నదే తమ లక్ష్యం అని పోలాడి రామారావు అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 80సంవత్సరాలు గడుస్తున్నా పేదలు పేదలుగానే ఉంటున్నారని ధన వంతులు మరింత ధనవంతులు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ల వల్ల క్రిమిలేయర్ విధానం అమలు లేకపోవడం వల్ల అవకాశం ఉండి రిజర్వేషన్లకు నోచుకోక అట్టడుగు వర్గాల పేద ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రామారావు అభిప్రాయ పడ్డారు. దీంతో సామాజిక సమతూకం దెబ్బతిని యువతరంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడుతున్నాయన్నారు.
ఈ నేపథ్యంలో సమాజంలో అన్ని వర్గాల పేదలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి సంక్షేమ రంగాల్లో సమన్యాయం జరుగుటకు ప్రస్తుతం అమలవుతున్న కుల మత ప్రాతి పదిక రిజర్వేషన్లు కాకుండా ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్లు కల్పించాలని ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఇందుకు ప్రత్యేక చట్టం తేవడానికి రాజ్యాంగ సవరణ జరుపుటకు పార్లమెంట్ లో చర్చించి కేంద్రం ప్రత్యేక కమిషన్ వేసి అన్ని వర్గాల ఆర్ధిక స్థితి గతులను అధ్యయనం చేసి దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని పోలాడి రామారావు విజ్ఞప్తి చేశారు.




